Andhra Pradesh: చంద్రబాబు అంగన్ వాడీల్లో కూడా ఇంగ్లిష్ ప్రవేశపెట్టారు.. తెలుగును చంపేశారు!: యార్లగడ్డ ఆగ్రహం

  • వైఎస్ తెలుగుకు ప్రాచీన హోదా తెచ్చారు
  • బాబు తెలుగు వర్సిటీనే మూసేశారు
  • తిరుమలలో మీడియాతో మాజీ ఎంపీ

తమిళనాడు అడుగడుగునా అడ్డుపడ్డా అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించారని పార్లమెంటు మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు అంగన్ వాడీల్లో కూడా ఇంగ్లిష్ భాషను ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంగ్లిష్ భాషను ప్రవేశపెట్టడం ద్వారా తెలుగును చంపేశారని ఆరోపించారు.

ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం యార్లగడ్డ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రంలోని తెలుగు విశ్వవిద్యాలయాన్ని సైతం మూసేశారని యార్లగడ్డ మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి వల్లే రాజన్న రాజ్యం సాధ్యమని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Chandrababu
ysr
Jagan
yarlagadda
  • Loading...

More Telugu News