Chandrababu: చంద్రబాబంటే ఎంతో గౌరవం... పవర్ లేని సీఎం అని ఎన్నడూ అనలేదు: ఏపీ సీఈఓ ద్వివేది

  • పిచ్చాపాటిగా సైతం ఆ మాటనలేదు
  • ఈసీ ప్రవర్తనా నియమావళి గురించే మాట్లాడాను
  • మీడియాతో గోపాలకృష్ణ ద్వివేది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడంటే తనకెంతో గౌరవముందని, ఆయన్ను అధికారాలు లేని సీఎం అని తాను ఎన్నడూ వ్యాఖ్యానించలేదని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వ్యాఖ్యానించారు.

అమరావతిలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన, పిచ్చాపాటిగా సైతం తాను ఆ మాటను ఎవరితోనూ అనలేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత ఈసీ నిర్దేశించిన ప్రవర్తనా నియమావళి ప్రకారమే అధికారులైనా, ప్రజా ప్రతినిధులైనా నడుచుకోవాల్సిందేనని, తాను ఆ విషయాన్నే చెబుతానని, అదే మాట మాట్లాడానే తప్ప చంద్రబాబును ఉద్దేశించి తానేమీ అనలేదని చెప్పారు. సీఎంకు అధికారాలు ఉన్నాయా? లేవా? అన్న అంశం ప్రస్తావనకే రాలేదని తెలిపారు.
 
తాను అనని విషయాన్ని అన్నానంటూ జాతీయ ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు. వివిధ కారణాల వల్ల రాష్ట్రంలోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాల్సివుందని, మే 23లోపు ఎప్పుడైనా రీపోలింగ్ నిర్వహిస్తామని, ఇంకా తేదీలు ఖరారు కాలేదని ద్వివేది వెల్లడించారు.

Chandrababu
Andhra Pradesh
Dwivedi
CEC
  • Loading...

More Telugu News