Renigunta: రేణిగుంట విమానాశ్రయంలో కమలాపురం సింగిల్ విండో చైర్మన్ సాయినాథ్ శర్మ వద్ద 20 బుల్లెట్లు లభ్యం

  • పోలీసుల తనిఖీల్లో భాగంగా దొరికిన బుల్లెట్లు
  • సాయినాథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • టీడీపీ నేత ముఖ్య అనుచరుడని సమాచారం

రేణిగుంట విమానాశ్రయంలో నేడు ఓ వ్యక్తి వద్ద 20 బుల్లెట్లు దొరకడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసుల తనిఖీల్లో భాగంగా కడప జిల్లా కమలాపురం సింగిల్ విండో చైర్మన్ సాయినాథ్ శర్మ వద్ద 20 బుల్లెట్లు లభించాయి. దీంతో సాయినాథ్‌ను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాయినాథ్, కడప జిల్లా కమలాపురం టీడీపీకి చెందిన ఓ ముఖ్య నేత అనుచరుడుగా తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సాయినాథ్ తన లైసెన్స్‌డ్ గన్‌ను పోలీసులకు డిపాజిట్ చేయలేదని తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Renigunta
Bullets
Kadapa District
Kamalapuram
Putta Narasimha Reddy
  • Loading...

More Telugu News