Cricket: అర్జున అవార్డుకు నలుగురు స్టార్ క్రికెటర్ల పేర్లను సిఫారసు చేసిన బీసీసీఐ
- టీమిండియా నుంచి షమీ, బుమ్రా, జడేజాలకు చాన్స్
- మహిళల జట్టు నుంచి పూనమ్ యాదవ్ కు అవకాశం
- సుదీర్ఘ చర్చ అనంతరం బీసీసీఐ నిర్ణయం
భారత క్రీడారంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే అర్జున అవార్డుల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ముగ్గురు పురుష క్రికెటర్లు, ఓ మహిళా క్రికెటర్ పేరును ప్రతిపాదించింది. టీమిండియా పురుషుల జట్టు నుంచి ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పేర్లను సిఫారసు చేసింది. మహిళల జట్టు నుంచి స్టార్ బౌలర్ పూనమ్ యాదవ్ పేరును ప్రతిపాదించారు.
అంతకుముందు, తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ పాలకవర్గం ఢిల్లీలో సమావేశమై సుదీర్ఘ కసరత్తు చేసింది. క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ సాబా కరీమ్ ఈ నలుగురి పేర్లను ప్రతిపాదించగా, వినోద్ రాయ్, డయానా ఎడుల్జి, లెఫ్టినెంట్ జనరల్ రవి తోడ్గేలతో కూడిన పాలకవర్గం ఆమోద ముద్ర వేసింది.