Telangana: ఇంటర్ ఫలితాల అవకతవకలపై నివేదిక అందజేసిన త్రిసభ్య కమిటీ

  • ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం, గ్లోబరినా సంస్థ వైఫల్యమే కారణం
  • అనుభవం లేకపోవడం వల్లనే సాంకేతిక సమస్యలు
  • ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించిన కమిటీ

తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై నెలకొన్న గందరగోళంపై త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను తెలంగాణ సీఎస్ జోషికి కమిటీ సభ్యులు కొద్ది సేపటి క్రితం అందజేశారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం, గ్లోబరినా సంస్థ వైఫల్యమే కారణమని పన్నెండు పేజీల నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అనుభవం లేకపోవడం వల్లనే ఫలితాల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయని నిర్థారించారు. భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ నివేదికలో కమిటీ సూచించినట్టు సమాచారం. 

Telangana
Intermediate
board
CS
Joshi
  • Loading...

More Telugu News