Yadadri Bhuvanagiri District: నిన్న అదృశ్యమైన బాలిక శ్రావణి బావిలో శవమై తేలింది!

  • బొమ్మాల రామారంలోని హాజీపూర్ లో ఘటన
  • బావిలో శ్రావణి మృతదేహాం గుర్తింపు
  • ఫిర్యాదు చేసినా పోలీసులు ఆలస్యంగా స్పందించారు: కుటుంబ సభ్యుల ఆరోపణ

నిన్న అదృశ్యమైన బాలిక శ్రావణి మరణించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాల రామారం మండలంలోని హాజీపూర్ కు చెందిన ఈ బాలిక కీసరలో తొమ్మిదో తరగతి చదువుతోంది. నిన్న బొమ్మలరామారం నుంచి తమ గ్రామానికి నడుచుకుంటూ వెళ్లింది. అయితే, చీకటిపడుతున్నప్పటికీ శ్రావణి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈరోజు ఉదయం హాజీపూర్ శివారులోని బావి వద్ద పుస్తకాల సంచి పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడికి సమీపంలోనే ఉన్న మరో బావిలో శ్రావణి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శ్రావణిని హత్య చేసి ఉంటారని ఆమె కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణి అదృశ్యంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఆమె ఆచూకీ కనిపెట్టే విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హాజీపూర్ లో ఆందోళనకు దిగారు.

Yadadri Bhuvanagiri District
bommala ramaram
hazipur
Student
9th class
sravani
keesara
  • Loading...

More Telugu News