: రానున్న ఎన్నికలకు తెలంగాణ అజెండా కాకూడదు: కిషన్ రెడ్డి
తెలంగాణ అజెండాగా రానున్న ఎన్నికలు జరగకూడదన్నదే బీజేపీ ఆలోచన అని కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోపే కేంద్రం తెలంగాణ ప్రకటించే దిశగా బీజేపీ ఉద్యమిస్తుందని, మొదటి దశ ఉద్యమంలో భాగంగా తెలంగాణలో 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఉద్యమ సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జూన్ 3 న హైదరాబాద్ లో తెలంగాణ పోరు సభ జరుపుతామన్నారు. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ ప్రచారం చెయ్యలేరని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేసారు.