T-congress: నేను గెలిస్తే.. హైదరాబాద్-అమరావతికి రైలు మార్గం తీసుకొస్తా: కోమటిరెడ్డి వెంకట రెడ్డి

  • రెండు రాజధానుల మధ్య సులభ రవాణా ఉండాలి 
  • అందుకే, ఈ రైలు మార్గం తీసుకొస్తా
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా తాను గెలిస్తే హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా అమరావతికి రైలు మార్గం తీసుకొస్తానని అన్నారు. పోచంపల్లిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య సులభమైన రవాణా కోసం ఈ రైలు మార్గం తీసుకొస్తానని చెప్పారు. మూసీ నీటిని శుద్ధి చేయడానికి నదిపై ట్రీట్ మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తూ, ప్రభుత్వం సరిగా పనిచేయాలంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి తమ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. 

T-congress
komati reddy
venkat reddy
TRS
kcr
  • Loading...

More Telugu News