rajani: చిన్నల్లుడిని హీరోగా నిలబెట్టడం కోసం రంగంలోకి దిగిన రజనీ

  • నటనపై దృష్టిపెట్టిన రజనీ చిన్నల్లుడు 
  • రజనీ మాట మేరకు రంగంలోకి దిగిన కార్తీక్ సుబ్బరాజ్ 
  • మిగతా దర్శకులకు కూడా ఓ మాట చెప్పిన రజనీ   

రజనీకాంత్ పెద్దల్లుడు ధనుశ్ తమిళనాట స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అక్కడి మాస్ ఆడియన్స్ లో ఆయనకి మంచి క్రేజ్ వుంది. ఇక పెద్దల్లుడి మాదిరిగానే చిన్నల్లుడు విశాగన్ ను కూడా హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో రజనీకాంత్ ఉన్నాడనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. రజనీకాంత్ చిన్నల్లుడు విశాగన్ వ్యాపార వేత్త అయినప్పటికీ నటన పట్ల ఆసక్తి వుంది. రజనీ కూతురు సౌందర్యతో వివాహానికి ముందే ఆయన ఒక సినిమాలో చేశాడు గానీ అది సరిగ్గా ఆడలేదు.

అయితే ఇప్పుడు నటనపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఉందని ఆయన రజనీకి చెప్పాడట. దాంతో కార్తీక్ సుబ్బరాజ్ ను రజనీ పిలిపించి, విశాగన్ కోసం ఒక మంచి కథను తయారు చేయించి ఆయనతో ఒక మంచి హిట్ మూవీ చేయమని చెప్పారట. యువ దర్శకుల్లో మంచి జోరుమీదున్న కార్తీక్ సుబ్బరాజ్, ప్రస్తుతం అదే పనిలో వున్నాడని అంటున్నారు. ఇక మరికొందరు దర్శకుల చెవిన కూడా చిన్నల్లుడి గురించి రజనీ ఓ మాట వేశాడని చెప్పుకుంటున్నారు.

rajani
vishagan
  • Loading...

More Telugu News