Gandhi Bhavan: గాంధీ భవన్ లో కూర్చుని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోం: కాంగ్రెస్ నేతలకు తలసాని వార్నింగ్

  • టీ-కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి
  • ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే కుదరదు
  • మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాతపెట్టారు

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గాంధీ భవన్ లో కూర్చుని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

 ప్రజలు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు కర్రు కాల్చి వాతపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, కేసీఆర్ పై విశ్వాసంపై ఉంది కనుకే తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం గురించి తలసాని ప్రస్తావిస్తూ, నిరాడంబరంగా నిర్వహిస్తామని, జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని అన్నారు.

Gandhi Bhavan
t-congress
TRS
talasani
  • Loading...

More Telugu News