vijayasai reddy: విజయసాయిరెడ్డిపై మండిపడ్డ బచ్చుల అర్జునుడు

  • విజయసాయిరెడ్డి దొంగల ముఠా నాయకుడు
  • రాజకీయ నేతలా సీఎస్ వ్యవహరిస్తున్నారు
  • మోదీ, కేసీఆర్ ల సమీక్షలు ఈసీకి కనిపించడం లేదా?

వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. విజయసాయిరెడ్డి దొంగల ముఠాకు నాయకుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఈసీపై ఆయన విమర్శలు గుప్పించారు. బాధ్యతలు మరచిపోయి ఈసీ పని చేస్తోందని అన్నారు.

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇష్టం వచ్చినట్టు మార్చేశారని... కొత్త సీఎస్ తన పరిధిని దాటి, రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా... ప్రభుత్వాధినేతగా సమీక్షలను నిర్వహించే అధికారం ముఖ్యమంత్రికి ఉందని అన్నారు. ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు చేస్తున్న సమీక్షలు ఈసీకి కనిపించడం లేదా? అని మండిపడ్డారు. చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తే ఏదో తప్పు చేసినట్టు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

vijayasai reddy
bachula arjunudu
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News