Chandrababu: ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: సీఎస్‌పై చినరాజప్ప ఫైర్‌

  • సీఎంని పనిచేయనీయకుండా అడ్డుకుంటున్నారు
  • ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంది ఓవరాక్షన్‌
  • వెనుక మోదీ ఉండి నడిపిస్తున్నారు

ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో పాలన సజావుగా సాగకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఇందుకు చీఫ్‌ సెక్రటరీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంను పావుగా వాడుకుంటోందని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సీఎస్‌ తన పరిధి, స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత పాలనాపరమైన వ్యవహారాలు సజావుగా సాగాల్సి ఉన్నా, సమీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన అడ్డం పడుతున్నారని ఆరోపించారు. ఇదంతా మోదీ ఆడుతున్న నాటకమన్నారు. ఇక, తిరుమల శ్రీవారి నగలు, ఇతరత్రా అంశాలపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.

Chandrababu
cs lvsubhramnyam
chinarajappa
Tirumala
  • Loading...

More Telugu News