Telugudesam: ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న విషయం సీఎస్ కు అవసరమా?: లంక దినకర్

  • సీఎస్ తన స్థానాన్ని దిగజార్చుతున్నారు
  • సీఎస్ చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి
  • రాష్ట్ర సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేది?

ఎన్నికల సమయంలో రాష్ట్ర సీఎస్ గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యవహారశైలిపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. సీఎం చంద్రబాబునాయుడు సైతం పలు సందర్భాల్లో సీఎస్ తీరును ప్రశ్నించారు. తాజాగా, టీడీపీ నేత లంక దినకర్ కూడా సీఎస్ పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన కీలకమైన సమీక్ష నిర్వహిస్తూ ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే విషయం ప్రస్తావించడం సీఎస్ కు అవసరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్ర సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సీఎస్ స్థానానికి తగిన రీతిలో వ్యవహరించడంలేదని విమర్శించారు. ముఖ్యమైన పరిపాలన శాఖలతో సమీక్ష సమావేశం చేపట్టి ముఖ్యమంత్రిని పిలవకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని లంక వ్యాఖ్యానించారు. సీఎస్ తన చర్యలతో రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News