Pakistan: మరోసారి పాక్ ప్రధాని విచిత్ర వ్యాఖ్య... పీపీపీ అధినేత బిలావల్ ను 'కుమారి బిలావల్' అని పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్

  • వజీరిస్తాన్ లో ఇమ్రాన్ వ్యాఖ్యలు 
  • స్పందించిన బిలావల్
  • అల్పులు పెద్ద బాధ్యతలు స్వీకరిస్తే ఇలాగే ఉంటుంది అంటూ ట్వీట్

ఇటీవలే జర్మనీతో జపాన్ సరిహద్దును పంచుకుంటోందంటూ అవగాహన రాహిత్యంతో వ్యాఖ్యానించి అభాసుపాలైన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి అదే తరహాలో కామెంట్ చేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో గురించి ప్రస్తావిస్తూ బిలావల్ సాహిబా (కుమారి బిలావల్) అంటూ వ్యాఖ్యానించారు. దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సభలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఈ వ్యాఖ్య చేశారు. ఇటీవలే ఇమ్రాన్ ఖాన్ జపాన్-జర్మనీ బోర్డర్ అంటూ కామెంట్ చేయడంతో దీనిపై బిలావల్ స్పందించారు.

"మన ప్రధాని జర్మనీ, జపాన్ సరిహద్దును పంచుకుంటున్నాయని భావిస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ యాజమాన్యం క్రికెట్ ఆడేవాళ్లకు డిగ్రీలు ఇస్తే ఇలాగే ఉంటుంది" అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై ఇమ్రాన్ వజీరిస్తాన్ సభలో మాట్లాడుతూ, "కుమారి బిలావల్ లాగా నేనేమీ అయాచితంగా అధికారం చేపట్టలేదు. అవినీతిని అరికట్టి దేశ ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చాను" అంటూ రిప్లయ్ ఇచ్చాడు. దీనికి కూడా బిలావల్ బదులిచ్చారు. ఆయన ట్వీట్ చేస్తూ, అత్యంత బాధ్యతాయుతమైన కార్యాలయాల్లో అల్పులను కూర్చోబెడితే ఇలాగే ఉంటుందని సెటైర్ వేశారు.

  • Loading...

More Telugu News