priyanka gandhi: సస్పెన్స్ వీడింది... మోదీపై ప్రియాంక పోటీ చేయడం లేదు!

  • అజయ్ రాయ్ ను బరిలోకి దింపిన కాంగ్రెస్
  • 2014లో మూడో స్థానంలో నిలిచిన అజయ్
  • 5.8 లక్షల ఓట్లు సాధించిన మోదీ

వారణాసి లోక్ సభ స్థానంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకగాంధీ పోటీ చేస్తుందని జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. వారణాసి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రకటించింది. మోదీపై అజయ్ రాయ్ ను బరిలోకి దింపింది. 2014 ఎన్నికల్లో కూడా అజయ్ రాయ్ పోటీ చేశారు. అయితే, మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఆయనకు 75,000 ఓట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సుమారు రెండు లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో మోదీకి 5.8 లక్షల ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి మహాకూటమి అభ్యర్థిగా సమాజ్ వాదీ పార్టీ నాయకురాలు షాలిని యాదవ్ బరిలోకి దిగారు.

priyanka gandhi
modi
ajay rai
varanasi
  • Loading...

More Telugu News