Andhra Pradesh: తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఎవ్వరూ మిగలరు!: టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్

  • బంగారం తరలింపులో టీటీడీ తప్పు లేదు
  • ఆ బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదే
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బంగారం తరలింపు వ్యవహారంపై టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఈ బంగారం తరలింపులో టీటీడీ తప్పు ఏమీ లేదని రాజేంద్రప్రసాద్ తెలిపారు. బంగారాన్ని సురక్షితంగా తరలించాల్సిన బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదే అని స్పష్టం చేశారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఎవ్వరూ మిగలరని హెచ్చరించారు.

అమరావతిలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ సమీక్షలు చేసే వీలు ఉందనీ, కానీ ఏపీలో మాత్రం సీఎం చంద్రబాబు ఎందుకు సమీక్షలు చేయకూడదని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈసారి ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు.

Andhra Pradesh
Telugudesam
rajendra prasad
amaravati
gold pnb
  • Loading...

More Telugu News