Andhra Pradesh: ఢిల్లీ చేరుకున్న ఏపీ ప్రభుత్వ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం!

  • నేడు ఏపీలో మైనింగ్ పై ఎన్జీటీ విచారణ
  • ఐఏఎస్ అధికారులతో కలిసి సీఎస్ హాజరు
  • ఏపీ ప్రభుత్వం-సీఎస్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారు. ఐఏఎస్ అధికారులు కరికాల్ వలవన్, అనంతరాములుతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఏపీలో మైనింగ్ కు సంబంధించి ఢిల్లీలోని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)లో ఈరోజు విచారణ సాగనుంది.

ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రం తరఫున సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరవుతున్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం-సీఎస్ మధ్య సంబంధాలు దిగజారిన నేపథ్యంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Andhra Pradesh
lv subramanyam
Telugudesam
ngt
mining case
  • Error fetching data: Network response was not ok

More Telugu News