Andhra Pradesh: నాతో అఫైర్ కొనసాగించు.. వివాహిత ఇంటి ముందు ప్రియుడి హల్ చల్!

  • ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘటన
  • పోలీసులకు సమాచారమిచ్చిన భార్యాభర్తలు
  • పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయేందుకు ప్రియుడి యత్నం

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. గతంలో తనతో పెట్టుకున్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని ఓ వ్యక్తి వివాహిత ఇంటి ముందు హల్ చల్ చేశాడు. రాజమండ్రికి చెందిన తాటిపాక పెద్దరాజు గుంటూరులో నాలుగేళ్ల క్రితం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అతను తన ఇంట్లో పెద్దరాజుకు ఆశ్రయమిచ్చాడు.

ఈ క్రమంలో సదరు వ్యక్తి భార్యతో పెద్దరాజు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం వీరిద్దరూ కేరళకు పారిపోయారు. అయితే తనకు చిన్నపిల్లలు ఉన్నారనీ కుటుంబ సభ్యుల ద్వారా నచ్చజెప్పిన సదరు భర్త, భార్యను వెనక్కు తెచ్చుకున్నాడు. అయితే గుంటూరులోనే ఉంటే కాపురానికి ఇబ్బంది అని వినుకొండకు మారిపోయారు.

కానీ ఈ విషయం తెలుసుకున్న పెద్దరాజు ఈరోజు వినుకొండలో వారి ఇంటి ముందుకు వచ్చి రచ్చరచ్చ చేశాడు. తనతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశాడు. దీంతో భార్యాభర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు పెద్దరాజును పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పెద్దరాజు వాష్ రూమ్ కు వెళుతున్నట్లు నటించి అక్కడి నుంచి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతడిని సెల్ లో కూర్చోబెట్టారు.

Andhra Pradesh
Gujarath
affair
extra martial affair
lover
  • Loading...

More Telugu News