NTR: ఎన్టీఆర్ కు హీరోయిన్ పై రాజమౌళికి సలహా ఇచ్చిన సల్మాన్ ఖాన్!

  • రామ్ చరణ్ సరసన ఆలియా భట్
  • ఎన్టీఆర్ పక్కన తొలుత డైసీ ఎడ్గర్ జోన్స్
  • ఆమె తప్పుకోవడంతో తెరపైకి జాక్వలీన్

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ తదితర ప్రముఖులు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు యుక్తవయసు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా, ఆయన సరసన సీతగా ఆలియా భట్ కనిపించనుంది. ఇదే సమయంలో కొమరం భీమ్ యుక్త వయసు పాత్రలో కనిపించే ఎన్టీఆర్ సరసన తొలుత బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ ను తీసుకున్నారు.

అయితే, ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో ఎన్టీఆర్ కు హీరోయిన్ ను వెతుకుతున్న రాజమౌళికి, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సలహా ఇచ్చాడట. ఎన్టీఆర్ కు జోడీగా జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ ను తీసుకోవాలని సల్మాన్ చెప్పగానే రాజమౌళి కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. శ్రీలంకకు చెందిన జాక్వెలీన్‌ లో కాస్త బ్రిటిష్‌ పోలికలు కనిపిస్తాయని, తారక్‌ కు జోడీగా ఆమె సరిపోతుందని సల్మాన్ చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

NTR
Ramcharan
Rajamouli
Salman Khan
Alia Bhat
RRR
  • Loading...

More Telugu News