Tiktok: పరిమితులు విధిస్తూ టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేసిన మద్రాస్ హైకోర్టు
- పోర్నోగ్రఫీ వీడియోలను అప్‌లోడ్ చేయకూడదు
- వైఫల్యం చెందితే కోర్టు ధిక్కరణే
- బ్యాన్ చేసిన కారణంగా రోజుకు 3.5 కోట్లు నష్టం
టిక్‌టాక్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. టిక్‌టాక్‌పై కొన్ని పరిమితులు విధిస్తూ ధర్మాసనం మధ్యంతర నిషేధాన్ని ఎత్తివేసింది. పోర్నోగ్రఫీ వంటి వీడియోలను అప్‌లోడ్ చేయకూడదని, ఈ విషయమై వైఫల్యం చెందితే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది.
ఇటీవల ముత్తుకుమార్ అనే న్యాయవాది టిక్‌టాక్‌పై కేసు వేయడంతో హైకోర్టు మధ్యంతర నిషేధాన్ని విధించింది. అయితే, దీనిని బ్యాన్ చేసిన కారణంగా రోజుకు 3.5 కోట్లు నష్టం వాటిల్లిందని, 250 మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ సుప్రీంను ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు టిక్‌టాక్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో నేడు మద్రాసు హైకోర్టు నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పును వెలువరించింది.