Telugudesam: జన్మభూమి కమిటీల వల్ల చంద్రబాబు చేసిన మంచి అంతా పోయింది: టీడీపీ ఎంపీ జేసీ
- కాంగ్రెస్, వైసీపీ, జనసేన వాళ్లకు ఇళ్లు ఇవ్వొద్దనలేదే
- అందరికీ ఇళ్లు ఇవ్వమన్నారు
- జన్మభూమి కమిటీల వాళ్లు డబ్బు తీసుకుంటున్నారు
జన్మభూమి కమిటీల వల్ల చంద్రబాబు చేసిన మంచి అంతా పోయి, చెడు మిగిలిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, వైసీపీ, జనసేన పార్టీలకు చెందిన వారికి ఇళ్లు ఇవ్వొద్దని చంద్రబాబు అన్నారా? అందరికీ ఇళ్లు ఇవ్వమన్నారని అన్నారు.
కానీ, జన్మభూమి కమిటీల వాళ్లు డబ్బులు తీసుకుని వాళ్లకు నచ్చినోళ్లకు సిఫారసు చేస్తున్నారని, అందువల్ల చంద్రబాబునాయుడికి చెడ్డపేరు వస్తోందని, ఈ విషయాన్ని చంద్రబాబుకే స్పష్టంగా చెప్పానని అన్నారు. ‘ఓటుకు నోటు కేసు’లో ఏం లేదని, ఆ కేసును రాజకీయంగా వాడుకుని చంద్రబాబును దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు.