harish rao: టీఆర్ఎస్ పై హరీశ్ రావు తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయి: కేసీఆర్ సోదరుని కూతురు రమ్యారావు

  • కేసీఆర్, టీఆర్ఎస్ కోసం హరీశ్ ఎంతో కష్టపడ్డాడు
  • కొందరి వల్ల హరీశ్ ఇబ్బందులు పడుతున్నాడు
  • వేధింపులు ఎక్కువైతే తిరుగుబాటు చేసే అవకాశం ఉంది

టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు పార్టీపై తిరుగుబాటు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుని కూతురు రమ్యారావు అన్నారు. తొలి నుంచి కూడా కేసీఆర్ పక్కన ఉన్నది హరీశే అని ఆమె చెప్పారు. కేసీఆర్, టీఆర్ఎస్ కోసం హరీశ్ ఎంతో కష్టపడ్డాడని అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ అడుగుజాడల్లోనే ఉంటానని హరీశ్ ఎన్నోసార్లు చెప్పారని తెలిపారు. కేసీఆర్ వెంట హరీశ్ ఉన్నప్పుడు ఆయన కొడుకు కేటీఆర్ కానీ, కుమార్తె కవిత కానీ ఇక్కడ లేరని చెప్పారు. ముఖ్యమంత్రి వేరని, పార్టీ వేరని... పార్టీలో కొందరి వల్ల హరీశ్ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

తనకు కానీ, హరీశ్ కు కానీ కేసీఆర్ అన్యాయం చేయరని, కానీ ఇతరుల వల్ల అన్యాయం జరిగే అవకాశం ఉందని... ఈ విషయం తనకు, హరీశ్ కు ఎప్పుడో తెలుసని రమ్యారావు చెప్పారు. తొలుత తనకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు హరీశ్ కు జరుగుతోందని అన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తానని హరీశ్ ఇప్పటికీ అంటున్నారని... కానీ, పార్టీలో వేధింపులు ఎక్కువైతే, తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.  

harish rao
revolt
TRS
kcr
KTR
kavitha
ramya rao
  • Loading...

More Telugu News