Sunny Leone: 'ప్రభాకర్‌ను బతికించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాం, అయినా..' అంటూ కన్నీరుపెట్టుకున్న సన్నీలియోన్
- కిడ్నీ ఫెయిల్యూర్‌తో మృతి చెందిన టీం మెంబర్ ప్రభాకర్
- నిధుల సేకరణకు చాలా ప్రయత్నించామన్న సన్నీ
- నటిని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ నటుడు అర్బాజ్‌ఖాన్ చాట్‌లో పాల్గొన్న బాలీవుడ్ నటి సన్నీలియోన్ కన్నీటిపర్యంతమైంది. తన బృందంలోని ప్రభాకర్ యెడ్లె అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో మృతి చెందాడని చెబుతూ కన్నీరు పెట్టుకుంది. తనకు సహాయకుడిగా పనిచేసిన ప్రభాకర్ చాలామంచి వ్యక్తని పేర్కొన్న సన్నీ.. అతడిని బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంది. ప్రభాకర్‌కు భార్య, పిల్లలు, వయసు మీదపడిన తల్లి ఉన్నారని, వారికి అతడే ఆధారమని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభాకర్‌ను బతికించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశామని, తన భర్త డేనియల్‌తో కలిసి నిధుల సేకరణకు ప్రయత్నించామని వివరించింది.
అయితే, ప్రభాకర్ విషయంలో సన్నీపై అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమెను ట్రోల్ చేస్తూ విపరీత కామెంట్లు పెడుతున్నారు. సన్నీ రూ.1.38 కోట్లు పెట్టి ఖరీదైన కారు కొనుగోలు చేయగలదు కానీ రూ.20 లక్షలు ఖర్చు చేసి ప్రభాకర్‌కు చికిత్స చేయించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ధరించే చెప్పులు, బ్యాగు ఖరీదే రూ.20 లక్షలు ఉంటుందని ఒకరు, కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న సన్నీ.. ప్రభాకర్ కోసం డొనేషన్లు అడగడం సిగ్గుచేటని మరొకరు కామెంట్ చేశారు.