Arunachal Pradesh: ఫిలిప్పీన్స్‌ను కుదిపేసిన భారీ భూకంపాలు..16 మంది మృతి.. ఈశాన్య భారతంలోనూ ప్రకంపనలు

  • 6.1, 6.3 తీవ్రతతో భూకంపం
  • సునామీ భయం లేదన్న యూఎస్‌జీఎస్
  • అరుణాచల్‌ప్రదేశ్, అసోంలలోనూ కంపించిన భూమి

ఫిలిఫ్పీన్స్‌ను రెండు భారీ భూకంపాలు కుదిపేశాయి. మంగళవారం సంభవించిన ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. తొలుత ఆగ్నేయాసియా ద్వీప సమూహమైన లూజన్ ఐలండ్‌లో సోమవారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 6.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని సామర్ ద్వీపంలో 53.6 మైళ్ల లోతున భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. అయితే, సునామీ ప్రమాదం లేదని పేర్కొంది. ఈ ఘటనలో 29 భవనాలు నేలమట్టమయ్యాయి.

మరోవైపు, మంగళవారం అర్ధరాత్రి ఈశాన్య భారతదేశంలో భారీ భూకంపం సంభవించింది. అరుణాచల్‌ప్రదేశ్, అసోంలలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో భూమి కంపించడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మయన్మార్, భూటాన్‌లలోనూ భూమి కంపించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News