Sirisilla: ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 15 మంది అరెస్ట్

  • సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బెట్టింగ్
  • పక్కా సమాచారంతో దాడులు
  • గూగుల్ పే యాప్ ద్వారా లావాదేవీలు

ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 15 మందిని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెంకట రమణ మీడియాకు తెలిపారు. నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌పై బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు తెలిసిందన్నారు.

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ బెట్టింగ్ జరుగుతోందన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని తెలిపారు. వీరు గూగుల్ పే యాప్ ద్వారా డబ్బు లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి రూ.7500 నగదు, 18 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Sirisilla
IPL Betting
Venkata Ramana
Chennai Super Kings
Sun Risers Hyderabad
  • Loading...

More Telugu News