amarnath: శ్రీలంక పేలుళ్ల నుంచి తప్పించుకున్న వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్

  • స్నేహితులతో కలసి శ్రీలంక వెళ్లిన అమర్ నాథ్
  • ఆయన బస చేసిన హోటల్ సమీపంలో పేలుళ్లు
  • దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానమే కాపాడిందన్న అమర్

శ్రీలంక బాంబు పేలుళ్ల నుంచి పలువురు భారతీయులు తృటిలో బయటపడ్డారు. వీరిలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్ నాథ్ కూడా ఉన్నారు. ఎన్నికల అనంతరం సేద తీరేందుకు స్నేహితులతో కలసి అమర్ నాథ్ శ్రీలంకకు వెళ్లారు. ఆయన బస చేసిన కింగ్స్ జ్యూరీ హోటల్ కు అత్యంత సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. అప్రమత్తమైన అమర్, అతని స్నేహితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు. అమర్ తో పాటు వెళ్లినవారిలో వైసీపీ నేత శ్రీకాంత్ రాజు కూడా ఉన్నారు. విశాఖలో అమర నాథ్ మీడియాతో మాట్లాడుతూ, దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానమే తమను కాపాడాయని చెప్పారు.

amarnath
ysrcp
Sri Lanka
blasts
  • Loading...

More Telugu News