Vijay Sai Reddy: విజయసాయిరెడ్డి తప్పుడు వాదన చేస్తున్నారు: యనమల

  • సీఎం ఎక్కడుంటే అక్కడ మీటింగ్ లు పెట్టుకోవచ్చు
  • కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు
  • ఈ రోజు ఎన్నికలపై సమీక్ష నిర్వహిస్తాం

ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారంటూ ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేదీకి వైసీపీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. పార్టీ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అయిన వీడియో, టెలీ కాన్ఫరెన్స్ సదుపాయాలను చంద్రబాబు వాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ అతిథి భవనాలు, మీటింగ్ హాల్‌లు ఇతర సదుపాయాలను మిగిలిన పార్టీలు కూడా వినియోగించుకునేందుకు సమాన అవకాశం కల్పించాలని విజయసాయి కోరారు. అసలు ఈ సదుపాయాలన్నింటినీ వాడుకునేందుకు చంద్రబాబు ఈసీ అనుమతి తీసుకున్నారో, లేదో కూడా తమకు తెలియపరచాలని కోరారు.

ఈ లేఖపై ఏపీ మంత్రి యనమల మండిపడ్డారు. కనీస అవగాహన కూడా లేకుండా ఈసీకి విజయసాయిరెడ్డి లేఖ రాశారని అన్నారు. సీఎం ఎక్కడుంటే అక్కడ మీటింగ్ లు పెట్టుకోవచ్చని చెప్పారు. కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. మంత్రిమండలి కంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎక్కువ కాదని చెప్పారు. ఈరోజు ఎన్నికల మీద సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. 

  • Loading...

More Telugu News