Abdul Basith: ఎన్‌ఐఏ తనిఖీల్లో ఐసిస్ సానుభూతిపరుడు అబ్దుల్ బాసిత్ భార్య అరెస్ట్

  • నిన్నటి నుంచి ఎన్ఐఏ సోదాలు
  • నిన్న పలువురి అరెస్ట్
  • సిరియాకు వెళ్లేందుకు యత్నించిన బాసిత్ అరెస్ట్

హైదరాబాద్ నగరంలో పోలీసు అధికారులతో కలిసి ఎన్‌ఐఏ నిన్నటి నుంచి సోదాలు నిర్వహిస్తోంది. నిన్న ఫలక్‌నుమా, మైలార్‌దేవ్ పల్లి ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నేడు జరిపిన సోదాల్లో ఓ యువతిని అదుపులోకి తీసుకున్న అధికారులు, ఆమెను ఇటీవల అరెస్టైన ఐసిస్ సానుభూతిపరుడు అబ్దుల్ బాసిత్ భార్యగా గుర్తించారు.

సిరియా వెళ్లేందుకు ఎన్నోసార్లు యత్నించి బాసిత్ అరెస్ట్ అయ్యాడు. అయితే బాసిత్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఎన్‌ఐఏ విచారణలో వెలుగులోకి వచ్చింది. అతను తన అరెస్ట్‌కు కొన్ని నెలల ముందే రెండో వివాహం చేసుకున్నట్టు విచారణలో తెలిసింది. బాసిత్ ఇచ్చిన సమాచారంతో పాతబస్తీలోని రెండో భార్య నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు.

Abdul Basith
NIA
Hyderabad
Siriya
Police
Falaknuma
  • Loading...

More Telugu News