Lok sabha: ముగిసిన మూడవ విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం

  • 23న 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్
  • రాహుల్, అమిత్ షా పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా
  • అనంతనాగ్ లో బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఎన్నికలు

మూడవ విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 23న 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 116 లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. కర్ణాటక, కేరళ, ఒడిశా, గుజరాత్, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, అసోమ్ మహారాష్ట్ర, యూపీ, ఛత్తీస్ గడ్, జమ్ముకశ్మీర్, త్రిపుర దాద్రా అండ్ నగర్ హవేలి, డమన్ అండ్ డయ్యూలో ఎన్నికలు జరగనున్నాయి.

కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ, గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి అమిత్ షాలు పోటీ చేస్తున్న లోక్ సభ స్థానాలకు ఈ విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. కాగా, జమ్ము కశ్మీర్ లోని అనంతనాగ్ నియోజకవర్గంలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. 

Lok sabha
Elections
13 states
2 union territories
  • Loading...

More Telugu News