Kondandaram: ఇంటర్ బోర్డు ఫలితాల తప్పుల తడకపై చర్య తీసుకోవాలి: కోదండరాం

  • రైతులకు పరిహారం చెల్లించాలి
  • పాస్‌బుక్‌లు, చెక్కులు ఇవ్వాలి
  • అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం

2013 చట్టం ప్రకారం ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని తెలంగాణా జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొపెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందించారు. తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని కోదండరాం స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డు ఫలితాల తప్పుల తడకపై ప్రభుత్వం చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రైతుల పాస్‌బుక్‌లు, చెక్కులు వెంటనే ఇవ్వాలని కోదండరాం కోరారు.

Kondandaram
Inter board
Telangana Jana Samithi
Formers
Pass books
  • Loading...

More Telugu News