Andhra Pradesh: అమాయకులపై దాడి అమానుషం.. ఈ నీచమైన చర్యను ఖండిస్తున్నా!: ఏపీ మంత్రి నారా లోకేశ్

  • ఈస్టర్ రోజున చర్చ్ లు, హోటళ్లపై దాడి
  • 252 మంది దుర్మరణం, వందలాది మందికి గాయాలు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు చర్చ్ లు, విదేశీయులు బసచేసే హోటళ్లే లక్ష్యంగా ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 252 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ దుర్ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకుంటున్న ప్రజలపై ఉగ్రదాడి అమానుషమని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈరోజు ట్విట్టర్ లో నారా లోకేశ్ స్పందిస్తూ..‘శ్రీలంకలో ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకుంటున్న  అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రవాదుల దాడి అమానుషం. కేవలం కొంతమంది మూర్ఖత్వానికి ఇలా వందలమంది మరణించడం చాలా బాధాకరం. ఉగ్రవాదుల నీచమైన చర్యలను ఖండిస్తున్నాను. దాడిలో మరణించిన వారి  కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Nara Lokesh
Telugudesam
srilanka
colombo
terror attack
  • Loading...

More Telugu News