Sri Lanka: ఎన్ టీ జే.. శ్రీలంకలో నరమేధం సృష్టించింది ఈ సంస్థేనా?

  • చర్చిలు, భారత హైకమిషన్ ఆఫీసే లక్ష్యం!
  • 10 రోజుల ముందే పోలీసులకు సమాచారం
  • గతేడాది బుద్ధ విగ్రహాల కూల్చివేతతో వెలుగులోకి వచ్చిన సంస్థ

కొన్ని దశాబ్దాలుగా ఈలం వేర్పాటువాదంతో అట్టుడికిన శ్రీలంక కొన్నాళ్లుగా ప్రశాంత జీవనం గడుపుతోంది. అయితే, గతేడాది దేశవ్యాప్తంగా బుద్ధ విగ్రహాలు నేలకూల్చి కలకలం రేపిందో సంస్థ. దాని పేరు నేషనల్ తోహీత్ జమాత్ (ఎన్ టీ జే). అప్పుడా సంస్థను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఏవో నిరసనలు, ధర్నాలు, ఆందోళనలకు మాత్రమే పరిమితం అని తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడా నిర్లక్ష్యమే శ్రీలంక రాజధాని కొలంబోలో నెత్తుటేరులు పారడానికి కారణమైందా? అంటే అవుననే చెబుతున్నాయి అక్కడి ‌నిఘా వర్గాలు.

ఏప్రిల్ 11న శ్రీలంక పోలీస్ చీఫ్ పుజుత్ జయసుందరకు దాడుల విషయమై ముందస్తు సమాచారం అందింది. ఎన్ టీ జే అనే ముస్లిం అతివాద సంస్థ దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు తెగబడేందుకు సిద్ధంగా ఉందని ఓ విదేశీ నిఘా సంస్థ తమ సమాచారంలో పేర్కొంది. ప్రధానంగా చర్చిలు, శ్రీలంకలో భారత హైకమిషన్ కార్యాలయం ఎన్ టీ జే టార్గెట్ అని కూడా హెచ్చరించింది.

దీనిపై, శ్రీలంకలో హైలెవల్ ఇంటెలిజెన్స్‌ మీటింగ్ కూడా నిర్వహించారు. కానీ, ఈస్టర్ పండుగనాడే ముష్కరులు పంజా విసరడంతో కొలంబో రక్తసిక్తమైంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 156 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే, దాడులకు ఇప్పటివరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News