Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. యువతిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన ముఠా!

  • ముజఫర్ నగర్ జిల్లాలోని జబేపూర్ గ్రామంలో ఘటన
  • ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన నిందితులు
  • చెరకు తోటలోకి తీసుకెళ్లి లైంగికదాడి.. అనంతరం పరారు

ఉత్తరప్రదేశ్ లో కామాంధులు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి పరారయ్యారు. దీంతో బాధితురాలు నేరుగా పోలీసులను ఆశ్రయించింది. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

యూపీలోని ముజఫర్ నగర్ జిల్లా జబేపూర్ గ్రామంలో ఓ యువతి(23) తన ఇంట్లో ఉంటోంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడాన్ని గుర్తించిన నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం ఓ కారులో ఆమెను కిడ్నాప్ చేసి చెరకు తోటలోకి తీసుకెళ్లారు. అక్కడే ఒకరి తర్వాత మరొకరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత ‘ఈ విషయం ఎవరికైనా చెప్పావో నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తాం. నువ్వు ఎక్కడ ఉంటావో మాకు తెలుసు’ అని బెదిరించి పారిపోయారు. దీంతో అక్కడి నుంచి ఇంటికి వచ్చిన బాధితురాలు కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. అనంతరం వారితో కలిసి పుర్కాజీ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపును ముమ్మరం చేశారు.

Uttar Pradesh
GANG RAPE
23 YEAR OLD WOMEN
Police
  • Loading...

More Telugu News