Kodela Sivaprasad: ఇనిమెట్ల ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కోడెల

  • ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నందున కలిశా
  • ఎన్నికల్లో జరిగిన హింస గురించి వివరించా
  • గవర్నర్ చాలా బాగా సహకరించారు

ఎన్నికల రోజున గుంటూరు జిల్లా ఇనిమెట్ల పోలింగ్ బూత్‌లో తనపై జరిగిన దాడిపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. నేడు నరసింహన్‌‌తో భేటీ అయిన ఆయన తనపై జరిగిన దాడి ఘటనను వివరించారు.

అనంతరం కోడెల మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ఎన్నికల్లో జరిగిన హింస, ఘర్షణల గురించి గవర్నర్‌కు వివరించినట్టు తెలిపారు. ఏపీలో అధికార పక్షానికి గవర్నర్ చాలా బాగా సహకరించారని కొనియాడారు. గవర్నర్‌గా నరసింహన్ తన ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నందున మర్యాదపూర్వకంగా ఆయనను కలిసినట్టు కోడెల తెలిపారు.

Kodela Sivaprasad
Narasimhan
  • Loading...

More Telugu News