Andhra Pradesh: మహిళలు, పింఛన్ దారులు మా వెంటే.. టీడీపీకి 140 సీట్లు గ్యారెంటీ!: మాగంటి బాబు

  • జగన్ సీఎం కుర్చీ ఎక్కేందుకు కంగారు పడుతున్నారు
  • ఏ నేతయినా గరిష్టంగా రెండు పార్టీలు మారేలా చట్టం చేయాలి
  • ఏలూరులో మీడియాతో టీడీపీ పార్లమెంటు సభ్యుడు

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు విమర్శలు గుప్పించారు. ఏపీ ముఖ్యమంత్రిగా నేమ్ ప్లేట్ తయారుచేసుకున్న జగన్ సీఎం కుర్చీ ఎక్కడానికి కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరుపడితేవాళ్లు ఎక్కడానికి అదేమయినా మామూలు కుర్చీనా? లేక మ్యూజికల్ ఛైయిరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో ఈరోజు మాగంటి బాబు మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఈసారి 140 సీట్లు వస్తాయని మాగంటి బాబు జోస్యం చెప్పారు. మహిళలు, పింఛన్ దారుల ఓట్లతో ఈ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు ఎవరైనా గరిష్టంగా రెండు పార్టీలు మాత్రమే మారేలా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబు వల్లే సాధ్యమని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Telugudesam
140 seats
maganti babu
Chandrababu
  • Loading...

More Telugu News