KCR: నా భాష మీద నవ్వినవ్... ముఖాల మీద ఊసినవ్... కేసీఆర్ బయోపిక్ నుంచి వివాదాస్పద పాట!

  • ఆంధ్రులందరినీ అవమానించేలా పాట
  • అంగీకరించేది లేదంటూ కామెంట్లు
  • స్వయంగా లిరిక్స్ హమ్ చేసిన వర్మ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం సాగించిన వైనం ప్రధానాంశంగా రామ్ గోపాల్ వర్మ నిర్మించతలపెట్టిన 'టైగర్ కేసీఆర్'కు చెందిన ఓ పాట లిరిక్స్ ఇప్పుడు తీవ్ర వివాదం రేపేలా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం ఆయన లిరిక్స్ ను హమ్ చేస్తూ వీడియో విడుదల చేశారు.

"మా భాష మీద నవ్వినవ్... మా ముఖాల మీద ఊసినవ్... మా బాడీల మీద నడిసినవ్ ఆంధ్రోడా... వస్తున్నా... వస్తున్నా... మీ తాటతీయనీకి వస్తున్నా..." అంటూ తాను ప్రకటించిన 'టైగర్ కేసీఆర్' లోని ఓ సాంగ్ లిరిక్స్ ను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వయంగా పాడుతూ  వీడియో తీసి యూ ట్యూబ్ లో విడుదల చేశారు. 'టైగర్ కేసీఆర్  కమింగ్ సూన్' అని కూడా ఆయన అన్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఇది ఆంధ్రులనందరినీ అవమానించేలా ఉందని, ఈ పాటను అంగీకరించేది లేదని కామెంట్లు పెడుతున్నారు. మరి వీటిపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.

KCR
Biopic
Tiger KCR
  • Error fetching data: Network response was not ok

More Telugu News