anti-national: తనను బహిరంగంగా కాల్చి చంపాలంటూ కన్నీరు పెట్టుకున్న ఆజంఖాన్

  • నన్ను జాతి వ్యతిరేకిలా, ప్రపంచంలోనే పెద్ద ఉగ్రవాదిలా చూస్తున్నారు
  • రాంపూర్‌ను కంటోన్మెంటులా మార్చేశారు
  • ఆ మూడు రోజులు నేను ఎవరినీ కలవలేదు

తనను అందరూ ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాదిలా, జాతి వ్యతిరేక వ్యక్తిలా చూస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ నేత, రాంపూర్ లోక్‌సభ అభ్యర్థి ఆజంఖాన్ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాంపూర్‌‌లో నిర్వహించిన ర్యాలీలో ఆజంఖాన్ మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తాను ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్ మూడు రోజలపాటు నిషేధం విధించిందని పేర్కొన్న ఆయన ఆ మూడు రోజులూ తానెక్కడికీ వెళ్లలేదని, ఎవరినీ కలవలేదని చెప్పారు. ర్యాలీలు, బహిరంగ సభల్లోనూ మాట్లాడలేదన్నారు.

తనను జాతి వ్యతిరేకంగా చూస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్న ఆజంఖాన్.. పాలకుల వద్ద అధికారం ఉంది కాబట్టి తనను బహిరంగంగా కాల్చి చంపాలని అన్నారు. రాంపూర్‌ను కంటోన్మెంటుగా మార్చేశారని ఆరోపించారు. ఇక్కడ ప్రజాస్వామ్యమనేదే లేకుండా పోయిందని అన్నారు. తనను అభిమానించే వారి ఇళ్లకు తాళాలు వేశారని, తన పార్టీ జెండాను చింపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అభిమానించే కుటుంబాల్లోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆజంఖాన్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News