Renuka Chowdary: ఓటమి భయంతోనే రేణుకా చౌదరి అసత్య ఆరోపణలు: పువ్వాడ అజయ్

  • ఖమ్మం పార్లమెంటును టీఆర్ఎస్ గెలుచుకుంటుంది
  • దొంగ ఓట్లు వేయించానని నిరూపిస్తే రాజీనామా చేస్తా
  • ఎలాంటి విచారణకైనా సిద్ధమే

ఓటమి భయంతో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రేణుకా చౌదరి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని టీఆర్ఎస్ గెలుచుకోనుందని ధీమాగా చెప్పారు. తాను దొంగ ఓట్లు వేయించానని ఆరోపిస్తున్నారని, ఆ విషయాన్ని నిరూపిస్తే తాను తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా, ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే రేణుక, తనపై, తన కుమారుడిపై ఈసీకి ఫిర్యాదు చేశారని అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Renuka Chowdary
Puvvada Ajay
Khammam
EC
TRS
  • Loading...

More Telugu News