modi: అంత మాట అంటారా? రాహుల్ ను కోర్టుకు లాగుతా: లలిత్ మోదీ

  • మోదీలంతా దొంగలేనన్న రాహుల్ పై కోర్టులో కేసు వేస్తా
  • ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకుంది గాంధీలే
  • నరేంద్రమోదీ, లలిత్ మోదీ, రాహుల్ గాంధీల్లో ఎవరు దొంగ?

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ మండిపడ్డారు. దొంగలందరి పేర్ల చివరన మోదీ ఉంటుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 'మోదీలందరూ దొంగలేనని పప్పు రాహుల్ గాంధీ అన్నారు. యూకే కోర్టులో రాహుల్ పై కేసు వేస్తా. ఆయనను కోర్టులకు లాగుతా. ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకుంది గాంధీల కుటుంబమే' అంటూ ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీ, లలిత్ మోదీ, రాహుల్ గాంధీల్లో ఎవరు దొంగ? ఎవరు కాపలాదారుడు? అని ప్రశ్నించారు.

2010లో లలిత్ మోదీ ఇండియాను విడిచి వెళ్లిపోయారు. పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ తదితర కేసులు ఆయనపై ఉన్నాయి. లండన్ లో ఉన్న మోదీని భారత్ కు రప్పించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. మోదీపై అంతర్జాతీయ వారంట్ ను విధించాలన్న భారత అభ్యర్థనను 2017 మార్చ్ లో ఇంటర్ పోల్ తిరస్కరించింది.

modi
lalit modi
rahul gandhi
bjp
congress
  • Error fetching data: Network response was not ok

More Telugu News