Chandrababu: చంద్రబాబు నాలుగోసారి సీఎం కాబోతున్నారు.. టీడీపీ అత్యధిక స్థానాలు గెలుస్తుంది: రెడ్డి చెరువు సిద్ధాంతి

  • 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని చెప్పా
  • 2014లో చంద్రబాబు, మోదీ అధికారంలోకి వస్తారని చెప్పా
  • ఈ ఎన్నికల్లో మోదీ అతి తక్కువ మెజార్టీతో ప్రధాని అవుతారు

ఈ ఎన్నికలలో టీడీపీ అత్యధిక స్థానాలలో గెలుపొందబోతోందని... చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారని జంగారెడ్డిగూడెంకు చెందిన రెడ్డి చెరువు సిద్ధాంతి మరాటా మదన్ కుమార్ జోస్యం చెప్పారు. కర్ణాటకలోని దేవమ్మ తల్లి అనుగ్రహంతో గత 12 ఏళ్లుగా జ్యోతిష్యం, వైద్యం చేస్తున్నానని ఆయన తెలిపారు.

2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని... 2014లో చంద్రబాబు, మోదీ అధికారంలోకి వస్తారని 15 రోజుల ముందే ఛాలెంజ్ చేసి చెప్పానని సిద్ధాంతి అన్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందబోతోందనే విషయాన్ని కూడా వెల్లడించానని చెప్పారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో మోదీ అతి తక్కువ మెజార్టీతో మళ్లీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. తాను చెప్పినవన్నీ ఇప్పటి వరకు జరిగాయని... ఇప్పుడు చెప్పింది కూడా జరగబోతోందని తెలిపారు.

Chandrababu
Telugudesam
win
marata
madan kumar
prediction
modi
bjp
  • Loading...

More Telugu News