PVR Express Highway: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలంటే కొంతకాలం ఇబ్బందులే!

  • పీవీఆర్ ఎక్స్ ప్రెస్ వేపై బ్లాక్ టాపింగ్
  • 22 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు
  • ఫ్లయ్ ఓవర్ కింద నుంచి వెళ్లాలన్న పోలీసులు

హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ప్రజలు కొన్ని రోజుల పాటు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలంటే ఇబ్బందులు పడక తప్పదు. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకూ ఉన్న పీవీఎన్ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై 22 వరకూ ట్రాఫిక్ ఆంక్షలుంటాయని పోలీసులు వెల్లడించారు.

రహదారిపై బ్లాక్‌ టాపింగ్‌ (బీటీ) వేస్తున్నందున ట్రాఫిక్ ను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆరాంఘర్‌ నుంచి శంషాబాద్‌, ఆర్జీఐ వరకూ రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఎయిర్ పోర్టుకు వెళ్లాలనుకునేవారు మెహిదీపట్నం నుంచి పీవీఎన్ఆర్‌ ఎక్స్‌ ప్రెస్‌ వే కింద నుంచి వెళ్లాలని.. అటు నుంచి వచ్చే వారు ఆరాంఘర్‌, శంకర్‌పల్లి, పీడీపీ ఎక్స్‌ రోడ్‌, ఉప్పర్‌ పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్‌, రేతిబౌలిల మీదుగా రావాలని సూచించారు.

PVR Express Highway
Shamshabad
RGIA
Hyderabad
Mehidipatnam
  • Loading...

More Telugu News