Hyderabad: ఇంటర్‌లో ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

  • గురువారం విడుదలైన ఫలితాలు
  • మనస్తాపంతో ఉరేసుకున్న విద్యార్థిని
  • హైదరాబాద్‌లోని గాంధీనగర్ పరిధిలో ఘటన

తెలంగాణలో గురువారం ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల్లో మరోమారు బాలికలదే పైచేయి అయింది. అయితే.. ఫెయిలైన ఓ విద్యార్థిని మాత్రం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

కోఠిలోని ప్రగతి మహావిద్యాలయంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న అనామిక ఫెయిలైంది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో తన పేరు కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
Gandhinagar
Inter girl
suicide
Telangana
  • Loading...

More Telugu News