Guntur: ఏపీలోని మూడు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

  • గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాలకు ముప్పు
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన
  • సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి

ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ మూడు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికను జారీ చేశారు. గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని చెప్పారు. ముఖ్యంగా ఆయా జిల్లాల్లోని ఏయే ప్రాంతాల్లో పిడుగులు పడనుందో కూడా తెలిపారు.

గుంటూరు జిల్లా మాచెర్ల, దుర్గి, వెల్దుర్తి, రెంటచింతల గురజాలలోను, కడప జిల్లాలో వీరబల్లి, టి-సుండుపల్లె, రాజంపేట, చిట్వేల్ మండలాల పరిసర ప్రాంతాల్లోను, అలాగే నెల్లూరు జిల్లా దక్కిలి, రాపూర్ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని తేల్చారు. ఈ జిల్లాలకు చెందిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ కమిషనర్ తెలిపారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

Guntur
Nellore
Kadapa
Rapur
Rajampet
  • Loading...

More Telugu News