cuddapah: నేడు ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

  • రాత్రి 8 గంటలకు కోదండరామస్వామి కల్యాణోత్సవం
  • హాజరవుతున్న గవర్నర్ నరసింహన్
  • ఒంటిమిట్టలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

కడప జిల్లా ఒంటిమిట్టలో ఈ రోజు రాత్రి 8 గంటలకు శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలకు ఈరోజు సాయంత్రం శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఆలయం నుంచి కల్యాణ వేదిక వరకు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. కల్యాణ వేదిక ముఖద్వారం నుంచి ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య సమయంలో స్వామి వారికి అలంకరణ చేయనున్నారు.

  కాగా, ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు స్వామి వారిని సీఎం చంద్రబాబునాయుడు దర్శించుకోనున్నారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. అలాగే స్వామి వారి కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్బంగా ఒంటిమిట్టలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తున్నారు.

cuddapah
ontimitta
cm
Chandrababu
governer
  • Loading...

More Telugu News