Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారు

  • ఏప్రిల్ 20న ఎన్నికల షెడ్యూల్ విడుదల 
  • మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ
  • ఏప్రిల్ 22న తొలివిడత నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 20న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఏప్రిల్ 22న తొలివిడత నోటిఫికేషన్ విడుదలవుతుంది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 6న తొలి విడత,10న రెండో విడత, 14న మూడో విడత పోలింగ్ జరగనుంది.  మే 23 తర్వాతే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.

కాగా, ఈ ఎన్నికల్లో 1,56,11,320 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 32,007 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో మొత్తం 539 జెడ్పీటీసీలు, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. 

Telangana
mptc
zptc
elections
shedule
  • Loading...

More Telugu News