: రఘునందన్ నన్ను కలవలేదు: చంద్రబాబు


టీఆర్ఎస్ వేటుకు గురైన రఘునందన్ తనను కలవలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రఘునందన్ ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు టీఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన టీడీపీవైపు చూస్తున్నట్టు కథనాలొచ్చిన నేపథ్యంలో బాబు స్పందించారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, తాను ఎవరినీ రహస్యంగా కలవనని అంటూ, ఏది చేసినా బహిరంగమే అని తేల్చి చెప్పారు.

టీడీపీ ఇంకా గేట్లు తెరవనేలేదని, ప్రస్తుతానికి తలుపులు మాత్రమే తీశామని అన్నారు. పార్టీలోకి వచ్చేందుకు చాలామందే వేచి ఉన్నారన్న బాబు.. త్వరలోనే అందరి వివరాలు తెలుస్తాయని చెప్పారు. మంచి వాళ్ళు, నిబద్ధత ఉన్న వ్యక్తులు వస్తే పార్టీలో తప్పక చేర్చుకుంటామని వెల్లడించారు. ఇక రెండ్రోజుల క్రితం పార్టీని వీడి, నిన్న టీఆర్ఎస్ లో చేరిన కడియం శ్రీహరి వ్యవహారంపై బాబు వ్యాఖ్యానించారు. పదవులు ఇచ్చినన్నాళ్ళూ పరిశుద్ధుడిలా కనిపించానని, ఇప్పుడు దుష్టుడిలా కనిపిస్తున్నానా? అని బాబు ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News