Inter results: నేటి సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

  • బోర్టు కార్యాలయంలో విడుదల చేయనున్న విద్యాశాఖ కార్యదర్శి
  • మొదటి, ద్వితీయ, ఒకేషనల్‌ ఫలితాలు ఒకేసారి విడుదల
  • వెబ్‌సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చని బోర్డు సూచన

తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో ఇంటర్‌ ఫలితాలు ఇప్పటికే విడుదల కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ చేసింది. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దనరెడ్డి ఫలితాలను విడదల చేస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. ఫలితాల కోసం tsbie services అనే మొబైల్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని  తెలుసుకోవచ్చని చెప్పారు. అలాగే www.pratibha.net తో పాటు tsbie.cgg.gov.in,.. bie.telangana.gov.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.

Inter results
telangana bord
evening 5pm
  • Loading...

More Telugu News