alliance: హరియాణాలో ‘ఆప్‌’తో పొత్తుకు కాంగ్రెస్ నో.. ఒంటరిగానే ముందుకెళ్తామన్న కేజ్రీవాల్ పార్టీ

  • హరియాణాలో ఆప్‌తో పొత్తుకు కాంగ్రెస్ నిరాకరణ
  • చండీగఢ్‌లోనూ అదే పరిస్థితి
  • ఇక చర్చలు లేనట్టేనన్న ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్

హరియాణాలో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య పొత్తు చర్చలు ఇక లేనట్టేనని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేతలైన గులాం నబీ ఆజాద్, పీసీ చాకో‌లతో తాను చర్చలు జరిపానని, హరియాణాలో 6:3:1 నిష్పత్తిలో సీట్ల కేటాయింపు జరగాలని ప్రతిపాదించినట్టు చెప్పారు.

ఢిల్లీలో కాంగ్రెస్‌కు మూడు సీట్లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ హరియాణాలో తమతో పొత్తుకు కాంగ్రెస్ నిరాకరించిందని సంజయ్ తెలిపారు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇకపై కాంగ్రెస్‌తో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. చండీగఢ్‌ను వదులుకోవడానికి తాము సిద్ధపడ్డప్పటికీ, తమతో కలిసి ముందుకు వచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించిందని ఆయన పేర్కొన్నారు.

alliance
Congress
AAP
Haryana
Sanjay Singh
Delhi
  • Loading...

More Telugu News