Poonam Kaur: మంగళవారం పూనమ్ కౌర్ ఫిర్యాదు... బుధవారానికి వీడియోలు డిలీట్!

  • అసభ్యకర వీడియోలు పెడుతున్నారు
  • పలు యూట్యూబ్ లింక్ లను అందించిన పూనమ్
  • ఐపీ అడ్రస్ ల వివరాలు సేకరిస్తున్న సైబర్ క్రైమ్

తన పరువు తీసేలా పలు అసభ్యకర, అభ్యంతరకర వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నటి పూనమ్ కౌర్ మంగళవారం నాడు సైబర్ క్రైమ్ పోలీసులకు పలు లింక్ లను అందించగా, బుధవారం నాటికి ఇవి డిలీట్ అయినట్టు అధికారులు గుర్తించారు. మంగళవారం నాడు ఆమె వాంగ్మూలం తీసుకున్న పోలీసులు, షర్మిల, లక్ష్మీపార్వతి, పూనమ్ లపై జరిగిన ప్రచారం వెనుక ఒకే ఐపీ అడ్రస్ లు, ఒకే వ్యక్తులు ఉన్నారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

ఓ సందర్భంలో తన వ్యక్తిగత విషయాలను తాను మాట్లాడుతుండగా, రికార్డు చేసి చానెళ్లలో అప్ లోడ్ చేశారంటూ పూనమ్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ వీడియోలను అప్ లోడ్ చేసిన ఐపీ అడ్రస్ లు, లాగిన్ ఐడీలు వంటి ఆధారాల కోసం తాము వేచి చూస్తున్నామని, అవి లభిస్తే కేసులో స్పష్టత వస్తుందని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ మీడియాకు తెలిపారు. 

Poonam Kaur
You Tube
Videos
Police
Cyber Crime
  • Loading...

More Telugu News