Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం!

  • కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో వర్షం
  • ఆయా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం
  • హుస్నాబాద్ లో తడిసిన ధాన్యపు రాశులు

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు సాయంత్రం వర్షం కురిసింది. కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జనగామ, నర్మెట్ల, తరిగొప్పులలో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో, పలుచోట్ల ధాన్యపు రాశులు తడిసిపోయాయి.

సిద్ధిపేట జిల్లాలోని సైదాపూర్,  హుస్నాబాద్, కోహెడ తదితర చోట్ల వర్షం పడింది. హుస్నాబాద్ మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసిపోయింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందుకుంట, వీణవంక, మంథని, రామగిరి, ముత్తారం, కమాన్ పూర్ మండలాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. 

Telangana
janagaon
peddapalli
karimnagar
siddipet
Huzurabad
veena vanka
manthani
  • Loading...

More Telugu News